VIDEO: సారా రహిత నియోజకవర్గంగా మార్చాలి: సీపీఐ
KKD: జగ్గంపేట నియోజకవర్గంలో సారా అమ్మకాలు, తయారీని అరికట్టాలని సీపీఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర నాయకుడు ఏగుపాటి అర్జునరావు డిమాండ్ చేశారు. శనివారం మధ్యాహ్నం గోవిందపురంలో అఖిలభారత ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో గిరిజనులతో కలిసి ఆందోళన నిర్వహించారు. ఎక్సైజ్ అధికారుల నిర్లక్ష్యం వల్లే సారా విచ్చలవిడిగా అమ్ముతున్నారని విమర్శించారు.