ఆర్డీవో కార్యాలయంలో గ్రీవెన్స్ డే

ఆర్డీవో కార్యాలయంలో గ్రీవెన్స్ డే

సత్యసాయి: ధర్మవరం ఆర్డీవో కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్డీవో మహేశ్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. డివిజన్‌లో పలు మండలాల నుంచి భూమి రీ సర్వేకు సంబంధించి ఎక్కువగా ప్రజలు అర్జీలు తీసుకొచ్చారు. అర్జీలను పరిశీలించి సమస్యలు పరిష్కరించాలని సంబంధిత విభాగపు అధికారులకు ఆర్డీవో సూచించారు.