రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక వాహన తనిఖీలు
కృష్ణా: గుడివాడలో రోడ్డు ప్రమాదాలను నివారించడం, అక్రమ రవాణా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నివారించడమే లక్ష్యంగా ఎస్సై చంటిబాబు శుక్రవారం ప్రత్యేక వాహన తనిఖీలు చేపట్టారు.ఈ సందర్భంగా అన్ని వాహనాలను ఆపి డ్రైవింగ్ లైసెన్స్, ఆర్.సి (RC), పొల్యూషన్ ఇన్షూరెన్స్ వంటి కీలక పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు.హెల్మెట్ ధరించని వాహనదారులపై చలాన్లు విధించారు.