'కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా బైక్ ర్యాలీ'

NZB: కేంద్ర ప్రభుత్వ విధానాలు, కార్పోరేట్ శక్తులతో దేశాన్ని విచ్చిన్నం చేస్తున్నారని సీఐటీయూ ఏరియా కార్యదర్శి నన్నేసాబ్ తెలిపారు. వర్ని మండల కేంద్రంలో పలు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో బుధవారం బైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ విధానాలకు కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగా దేశ ప్రజలందరూ సంఘటితమై పోరాడాలని నిరసన వ్యక్తం చేశామన్నారు.