పార్లమెంట్ ఉభయ సభలు ప్రారంభం
పార్లమెంట్ ఉభయ సభలు ప్రారంభమయ్యాయి. సమావేశాలు కావడంతో పార్లమెంట్ ఆవరణలో సస్పెండ్ అయిన ఎనిమిది మంది ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారంటూ నినాదాలు చేశారు. కాగా, ముందుగా పార్లమెంట్‌లో ఇటీవల మృతిచెందిన మాజీ ఎంపీలకు లోక్‌సభ సంతాపం తెలిపింది. అనంతరం లోక్‌సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు.