'సైబర్ నేరస్థులను పట్టుకోవాలి'

'సైబర్ నేరస్థులను పట్టుకోవాలి'

WGL: సైబర్ నేరాలు జరిగినప్పుడు కేవలం కేసులు నమోదు చేసి, బాధితులు నష్టపోయిన సొమ్మును తిరిగి ఇప్పించడమే పోలీసుల బాధ్యత కాదని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రిత్‌ సింగ్ అధికారులకు సూచించారు. నేరానికి పాల్పడిన నిందితులను పట్టుకునేందుకు కృషి చేయాలని ఆదేశించారు. నేరస్థులను అరెస్టు చేయడం ద్వారా సైబర్ నేరాలు జరగకుండా సమర్థంగా కట్టడి చేయవచ్చని స్పష్టం చేశారు.