సీసీ రోడ్ నిర్మాణ పనులు ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు
MDK: రామాయంపేట మున్సిపాలిటీ పరిధి బీసీ కాలనీ లో సిసి రోడ్ నిర్మాణానికి టీపీసీసీ సభ్యులు చౌదరి సుప్రభాత్ రావు, మాజీ కౌన్సిలర్ గజవాడ నాగరాజు శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే రోహిత్ రావు సహకారంతో 35 లక్షల రూపాయలు నిధులు మంజూరు కాగా సిసి రోడ్ నిర్మాణ పనులను ప్రారంభించారు. ప్రత్యేక నిధుల ద్వారా మున్సిపాలిటీ అభివృద్ధికి ఎమ్మెల్యే కృషి చేస్తున్నారన్నారు.