ప్రశాంతంగా ఎన్నికలు ప్రారంభం
MDK: హవేలీ ఘన్పూర్, కొత్తపల్లి గ్రామాల్లో గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైందని జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ నిర్వహణను ప్రత్యక్షంగా సందర్శించి, ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లలో జరుగుతున్న ఏర్పాట్లను సమీక్షించారు. ఓటర్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.