'మాతా, శిశు మరణాలు నియంత్రించాలి'
ASR: పాడేరు ఐటీడీఏ పరిధిలో మాతా, శిశు మరణాలు సంభవించకుండా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఐటీడీఏ పీవో శ్రీపూజ బుధవారం ఆదేశించారు. సికిల్ సెల్ అనీమియా స్క్రీనింగ్ టెస్ట్‌ల సంఖ్యను పెంచాలని, వాటి ద్వారా సంభవించే మరణాలను తగ్గించడంపై దృష్టి సారించాలన్నారు. గర్భిణీ స్త్రీలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు చేపట్టాలని తెలిపారు.