మారిన వాతావరణం.. ఎండల నుంచి ఉపశమనం
NGKL: లింగాలలో ఎండ తీవ్రతతో కొన్ని రోజులుగా ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. నిన్న మొన్నటి వరకు తీవ్రమైన ఎండలతో అల్లాడిన లింగాల, పరిసర ప్రాంతాల్లో ఈరోజు వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం నుంచే చిరుజల్లులు పడుతూ ఆకాశం పూర్తిగా మేఘావృతం కావడంతో ఎండ తీవ్రత తగ్గింది. ఎడతెరిపి లేని ఎండల నుంచి ఈ మేఘావృతమైన వాతావరణం కొంత ఉపశమనాన్ని కలిగిస్తోందని స్థానికులు తెలిపారు.