VIDEO: రోడ్డుపైన అక్రమ కమర్షియల్ భవనం
కృష్ణా: మచిలీపట్నం రేవతి సెంటర్ ప్రాంతం నిత్యం వాహనాల రద్దీతో కిటకిటలాడే కీలక కేంద్రం. పోలీసులు విధుల్లో ఉన్నప్పటికీ తరచూ ట్రాఫిక్ నిలిచిపోతూ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి అత్యంత రద్దీ ప్రాంతంలో ఇటీవల బహుళ అంతస్తుల కమర్షియల్ భవనం నిర్మాణం చేపట్టడం తీవ్ర ఆందోళనకు దారితీస్తుందని స్థానికులు శనివారం తెలిపారు.