CMRF చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే
NTR: వత్సవాయి మండలం భీమవరం గ్రామానికి చెందిన గోడితాల మమత రూ.67,378 సంగేపు లక్ష్మణ రూ.25,166 వారికి ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన రిలీఫ్ ఫండ్ చెక్కులను ఆదివారం ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య వారి నివాసంలో అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.