గూడెంలో ఘనంగా సత్యనారాయణ వ్రతాలు
MNCL: దండేపల్లి మండలంలోని గూడెం గుట్ట శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవాలయంలో 385 జంటలతో వేద పండితులు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఘనంగా నిర్వహించారు. కార్తీక మాసం సోమవారం సందర్భంగా ఆ దేవాలయం మండపంలో దంపతులతో వారు సత్యనారాయణ వ్రతాన్ని చేయించారు. అంతకుముందు వివిధ ప్రాంతాల నుండి భక్తులు, దేవాలయానికి వచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.