హెరిటేజ్ ఫుడ్స్‌పై ఆరోపణలు పూర్తిగా నిరాధారం: టీటీడీ ఛైర్మన్
TPT: కల్తీ నెయ్యి కేసులో వైసీపీ నేతలు హెరిటేజ్ ఫుడ్స్‌పై చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని టీటీడీ ఛైర్మన్ బీఆర్. నాయుడు స్పష్టం చేశారు. హెరిటేజ్ ఎప్పుడూ టీటీడీకు నెయ్యి సరఫరా చేయలేదని తెలిపారు. ఓపెన్ టెండర్ల ద్వారా పారదర్శకంగా నెయ్యి కొనుగోలు చేస్తున్నామని, స్వామివారి నైవేద్యాలు–అన్నప్రసాదాల నాణ్యతలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ ఉండదని వెల్లడించారు.