మున్సిపాలిటీకి కాసుల పంట..!
MDK: రామాయంపేట మున్సిపాలిటీకి కాసుల పంట పండింది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోటీ చేసే అభ్యర్థులు తమ ప్రాపర్టీ టాక్స్ పూర్తిగా చెల్లించి, నో డ్యూ సర్టిఫికెట్ తీసుకున్నారు. మూడు రోజుల వ్యవధిలో మున్సిపాలిటీకి ఆస్తి పన్ను ద్వారా 1,86,706 రూపాయల ఆదాయం రాగా. నో డ్యూ సర్టిఫికెట్ ద్వారా 2,50,000 ఆదాయం వచ్చింది. మొత్తం 4,36,706 ఆదాయం వచ్చింది.