ప్రేమ పెళ్లి.. ఏడాదికే భార్య సూసైడ్
HYD: ఎల్బీనగర్ మన్సురాబాద్‌లోని వాంబే కాలనీలో దారుణం జరిగింది. ప్రేమ వివాహం చేసుకున్న ఏడాదికే గంగోత్రి అనే యువతి.. ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భర్త బాను తనను కట్నం కోసం వేధిస్తున్నాడని, రూ.30 లక్షలు డిమాండ్ చేస్తూ పలుమార్లు దాడి చేశాడని సూసైడ్ లెటర్‌లో పేర్కొంది. పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడినా బాను తీరు మార్చుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది.