రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి
W.G: వీరవల్లి జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఓ గుర్తుతెలియని వృద్ధుడు ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం నడుచుకుంటూ వెళ్తున్న వృద్ధుడిని గుర్తుతెలియని వాహనం వేగంగా ఢీకొంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయన్ని 108 సిబ్బంది వెంటనే చికిత్స నిమిత్తం ఏలూరు సర్వజన ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఆయన మృతి చెందారు.