రైల్వేకోడూరు MPDO హెచ్చరికలు ఇవే..!

రైల్వేకోడూరు MPDO హెచ్చరికలు ఇవే..!

అన్నమయ్య: రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా పాపనాశం డ్యాం పూర్తిగా నిండింది. ఈ క్రమంలో డ్యాం గేట్లు తెరుస్తారని, గుంజనేరు పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రైల్వేకోడూరు ఎంపీడీవో నాగిరెడ్డి సూచించారు. స్థానిక అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్థానికులు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.