VIDEO: ఘోర ప్రమాదం.. ఒకరు మృతి

MHBD: పట్టణానికి చెందిన బాబు నాయక్ తండా వాసులు శ్రీశైలానికి విహారయాత్రకు వెళ్తుండగా, నకిరేకల్ వద్ద మినీ బస్సు అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మరణించగా, మరో 15 మంది గాయపడ్డారు. స్థానికులు గాయపడినవారిని నకిరేకల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.