కలెక్టర్‌ను కలిసిన జనసేన ఇంఛార్జ్

కలెక్టర్‌ను కలిసిన జనసేన ఇంఛార్జ్

KRNL: ఆలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జ్ తెర్నేకల్ వెంకప్ప శనివారం జిల్లా కలెక్టర్ రంజిత్ భాషాను కలిశారు. పందికోన రిజర్వాయర్ కోసం అవసరమైన 250 కోట్లు, గ్రామ రహదారులు, సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, పంచాయతీ నిధుల సక్రమ వినియోగం వంటి అంశాలపై చర్చించారు. ఆలూరు నియోజకవర్గం వెనుకబడిన ప్రాంతం కాబట్టి ప్రత్యేక దృష్టి చూపాలని కలెక్టర్‌ను కోరారు.