భక్త కనకదాసు విగ్రహాన్ని ఆవిష్కరించనున్న మంత్రి
అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గంలో ఇవాళ మంత్రి లోకేష్ రెండోరోజు పర్యటించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్న భక్త కనకదాసు 538వ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో పట్టణంలో ఏర్పాటు చేసిన భక్త కనకదాసు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం కనకదాసు సర్కిల్ వద్ద నిర్వహించనున్న బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు.