'షెడ్యూల్ ప్రకారం యూరియా సరఫరా చేస్తున్నాం'

VZM: బొబ్బిలి మండలం కసిందొరవలస గ్రామంలో RSK వద్ద 282యూరియా బస్తాలు పంపిణీ చేసినట్లు ఎమ్మార్వో శ్రీను తెలిపారు. శుక్రవారం యూరియా పంపిణీని పరిశీలించారు. జిల్లాలో యూరియా కొరత లేదని, రైతులు ఆందోళన చెందవద్దని, అన్ని గ్రామాల్లో షెడ్యూల్ ప్రకారం యూరియా సరఫరా చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు, అధికారులు పాల్గొన్నారు.