శ్రీరామనవమి వేడుకలకు ఆహ్వానం

ఖమ్మం: భద్రాచలం రామాలయంలో ఏప్రిల్ 9 నుంచి 23 వరకు వసంత పక్ష ప్రయుక్తంగా శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా శనివారం హైదరాబాద్‌లో సీఎస్ శాంతికుమారి, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, పలువురు ప్రముఖులకు ఆహ్వాన పత్రికలను అందజేశారు.