నాడు రాజకీయాలకు నిలయం.. నేడు విద్యా కేంద్రం
ADB: ఒకప్పుడు రాజకీయ తగాదాలతో అట్టుడికిన కప్పర్ల గ్రామం ప్రస్తుతం విద్యా కేంద్రంగా విరాజిల్లుతోంది. విద్య కోసం ఇబ్బందులు పడుతున్న యువతను గ్రామస్థులు గమనించి, రాజకీయాలను పక్కనపెట్టి రూ.10 లక్షలతో లైబ్రరి నిర్మించుకున్నారు. ఈ క్రమంలో ఏడాదిలోనే సుమారు 20 మంది పోలీస్, ఆర్మీ, గ్రూప్స్, పలు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించడం విశేషం. పట్టుదలతో ఊరంతా ఏకమైతే అభివృద్ధి సాధ్యమని కప్పర్ల నిరూపించింది.