క్రికెటర్ తిలక్ వర్మకు రామ్ చరణ్ స్పెషల్ గిఫ్ట్

క్రికెటర్ తిలక్ వర్మకు రామ్ చరణ్ స్పెషల్ గిఫ్ట్

హీరో రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబోలో పెద్ది మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం షూటింగ్ సెట్స్‌కి టీమిండియా క్రికెటర్ తిలక్ వర్మ వెళ్లారు. ఈ సందర్భంగా రామ్ చరణ్, చిత్రబృందంతో కాసేపు ముచ్చటించారు. అనంతరం సినిమాలో తాను వాడిన బ్యాట్‌ను తిలక్ వర్మకు రామ్ చరణ్ గిఫ్ట్‌గా ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.