'బాల్య వివాహాలకు పాల్పడితే శిక్ష తప్పదు'

'బాల్య వివాహాలకు పాల్పడితే శిక్ష తప్పదు'

ASR: రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు డాక్టర్ పీ.నాగ మానస మంగళవారం హుకుంపేట ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో పర్యటించారు. అక్షయ తృతీయ-బాల్య వివాహ నిర్మూలనలో భాగంగా పిల్లల తల్లిదండ్రులతో సమావేశమయ్యారు. బాల్య వివాహాలు సాంఘిక దురాచారం అన్నారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, బాల్య వివాహాలకు పాల్పడితే జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు.