హిడ్మా ఎన్‌కౌంటర్ బూటకం: పౌరహక్కుల నేత

మావోయిస్టు నేత హిడ్మా ఎన్‌కౌంటర్ బూటకమని పౌరహక్కుల నేత చంద్రశేఖర్ ఆరోపించారు. దేవ్‌జీని కూడా ఎన్‌కౌంటర్ చేయబోతున్నారని అన్నారు. అరెస్టు చేసిన వారిని మీడియా ముందు హాజరుపర్చాలని డిమాండ్ చేశారు. మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌పై న్యాయ విచారణ జరపాలని కోరారు. పోలీసుల అదుపులో మావోయిస్టులను చంపే కుట్ర చేస్తున్నారన్నారు.