అయ్యరక కాలనీలో తాగునీటి సమస్య

AKP: నాతవరం మండల పోలీస్ స్టేషన్ పరిదిలో ఉన్న అయ్యరక కాలనీలో గత 15 రోజులగా తాగునీటి సమస్య ఏర్పడింది. త్రాగునీరు ఎరుపు రంగులో రావడం దుర్వాసన వేయటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అధికారులకు తెలియజేసిన పట్టించుకోవడంలేదని వాపోతున్నారు. అసలే వ్యాధుల సీజన్ కావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇకనైనా అధికారులు స్పందించాలని కోరుతున్నారు.