VIDEO: 'సీఎం వెంటనే క్షమాపణలు చెప్పాలి'
SRCL: సీఎం రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకుడు కంచర్ల రవి గౌడ్ అన్నారు. సిరిసిల్లలోని బీఆర్ఎస్ కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. 10 సంవత్సరాలు అభివృద్ధి దిశగా పాలించిన మాజీ సీఎం కేసీఆర్‌పై ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సరికాదన్నారు. వెంటనే సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలన్నారు.