వరి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్

MBNR: అడ్డాకుల మండలం పొన్నకల్ గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి సందర్శించి, వరి ధాన్యం సేకరణను పరిశీలించారు. వరి ధాన్యం కొనుగోలులో అవకతవకలు జరగకుండా కొనుగోలు చేయాలని, కొనుగోలులో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ పర్యటనలో సింగిల్ విండో డైరెక్టర్‌లు, స్థానిక రైతులు పాల్గొన్నారు.