VIDEO: 'ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వద్దు'
SKLM: ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన వినతుల పరిష్కారంలో ఎలాంటి అలసత్వం వహించరాదని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అన్నారు. సోమవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను నిర్వహించారు. ఈ మేరకు జిల్లా నలుమూల నుంచి వచ్చిన ప్రజల నుంచి పలు వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.