జాతీయ సైన్స్ డే వారోత్సవాలు...విద్యార్థులకు పోటీలు
కోనసీమ: జాతీయ సైన్స్ డే వారోత్సవాల్లో భాగంగా బుధవారం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో అమలాపురంలో ఆన్ లైన్ క్విజ్ పోటీలు నిర్వహించారు. డీఈవో పి. నాగేశ్వరరావు ఈ పోటీలను ప్రారంభించారు. ఇందులో 262 ప్రభుత్వ, 108 ప్రైవేట్ పాఠశాలల నుంచి 6, 7, 8 తరగతుల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ నెల 6న 30 పాఠశాలలకు రెండో రౌండ్ పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా సైన్స్ అధికారి సుబ్రహ్మణ్యం తెలిపారు.