ఆర్థిక సాయం కోసం అథ్లెట్ విజ్ఞప్తి
PLD: నరసరావుపేట (M) గురవాయపాలెంకి చెందిన అథ్లెట్ నాగరవీంద్ర, రానున్న ఏషియన్ గేమ్స్‌లో పాల్గొనేందుకు ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఇండో-నేపాల్ అంతర్జాతీయ అథ్లెటిక్స్‌లో 200 మీటర్ల పరుగు పందెంలో బంగారు పతకం సాధించిన రవీంద్ర, తన కుటుంబ ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏషియన్ గేమ్స్‌లో పాల్గొనడం కష్టమని గురువారం ఎమ్మెల్యే చదలవాడ ద్వారా సీఎంకు తెలిపారు.