రంజాన్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

రంజాన్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

మెదక్ పట్టణంలోని నవాబ్ పెట్ ఈద్గా వద్ద రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరుల ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రార్థనల్లో మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులను ఆత్మీయంగా ఆలింగనం చేసుకుంటూ ఈద్ ముబారక్ తెలిపారు. ముస్లిం మైనారిటీల సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు, తదితరులు పాల్గొన్నారు.