'మోగ్లీ' సెకండ్ సింగిల్ రిలీజ్

టాలీవుడ్ నటుడు రాజీవ్ కనకాల, సుమ తనయుడు రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మూవీ 'మోగ్లీ'. ఈ సినిమా డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా.. దీని సెకండ్ సింగిల్ 'వనవాసం'ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇక అటవీ నేపథ్యంలో సాగే ప్రేమకథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాక్షి మడోల్కర్ కథానాయికగా నటిస్తుంది.