శాఖాహారంతో సంపూర్ణ ఆరోగ్యం: సొసైటీ ప్రతినిధులు
KMM: కామేపల్లి మండలం తాళ్లగూడెంలో పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ ఆధ్వర్యంలో నిన్న సాయంత్ర అహింసాయుత మహా కరుణ సద్భావన శాఖాహార ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతినిధులు శివ, శైలజ మాట్లాడారు. ధ్యానం సర్వరోగ నివారిణి అని, శాఖాహారంతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని తెలిపారు. ప్రతి జీవిని ప్రేమించాలని, శాకాహారిగా జీవించాలని కోరారు.