మహిళ కార్మికురాలిని అభినందించిన GM

మహిళ కార్మికురాలిని అభినందించిన GM

MNCL: సింగరేణి ఆస్తులను కాపాడడంలో అత్యంత అప్రమత్తత ప్రదర్శించిన KK ఓపెన్ కాస్ట్ జనరల్ అసిస్టెంట్ శ్రీలతను మందమర్రి ఏరియా GM రాధాకృష్ణ అభినందించారు. వర్క్ షాప్‌లో విలువైన సామాగ్రిని అదే గనిలో ఓ వ్యక్తి దొంగతనంగా తరలిస్తుండడం విధుల్లో ఉన్న శ్రీలత గమనించారు. ఏమాత్రం తడబడకుండా ఆమె సదరు వ్యక్తిని పట్టుకుని ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు.