ప్రజాదర్భార్ నిర్వహించిన ఎమ్మెల్యే
KRNL: ఆదోని ఎమ్మెల్యే డా. పార్థసారథి నిర్వహించిన ప్రజా దర్బార్‌లో ఇందిరానగర్ టీడీపీ మాజీ కౌన్సిలర్ మారుతి స్థానిక సమస్యలను ఎమ్మెల్యేకు శుక్రవారం వివరించారు. లక్ష్మమ్మ నగర్‌లో రోడ్లు, డ్రైనేజీ సమస్యలు కొనసాగుతుండగా, ఉప్పర వీధిలో సర్వే నం.399 భూమిని అక్రమంగా కబ్జా చేసి రోడ్డును పలువురు అడ్డుకుంటున్నారని చెప్పారు. ఈ సమస్యపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేకు విన్నవించారు.