ఓవర్ బ్రిడ్జి శంకుస్థాపన చేయనున్న సీఎం

AP: సీఎం చంద్రబాబు ఈ నెల 7న గుంటూరుకు రానున్నారు. శంకర్ విలాస్ వద్ద ఓవర్ బ్రిడ్జికి శంకుస్థాపన చేయనున్నారు. సీఎం రాక నేపథ్యంలో నగరపాలక సంస్థ అధికారులు శంకుస్థాపన స్థలాన్ని పరిశీలించారు. ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి కేంద్రం రూ.98 కోట్లు మంజూరు చేసింది.