పాఠశాలను తనిఖీ చేసిన ఎంఈఓ

GNTR: పొన్నూరు మండలం దొప్పలపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను గురువారం మండల విద్యాశాఖ అధికారి - 2 కొల్లి విజయభాస్కర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు పట్టికతో పాటు పాఠశాల రికార్డులు, రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం పదవ తరగతి విద్యార్థుల విద్యా సామర్థ్యాన్ని పరీక్షించి, ఉపాధ్యాయులకు తగు సూచనలు చేశారు.