ఆర్టీసీ బస్సులో వృద్ధురాలు మృతి

ఆర్టీసీ బస్సులో వృద్ధురాలు మృతి

WNP: అనారోగ్యంతో బాధపడుతున్న సంగినేనిపల్లి గ్రామానికి చెందిన రమిదాబేగం(67) జిల్లా ఆసుపత్రికి చికిత్స కోసం ఆర్టీసీ బస్సులో వెళ్తుండగా మార్గమధ్యంలో అపస్మారక స్థితిలోకి వెళ్లి మృతి చెందింది. ప్రయాణికులు ఆమెను వీపనగండ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు.