APK ఫైల్‌ను ఓపెన్ చేయొద్దు: సీఐ
W.G: చరవాణీలకు వచ్చే APK ఫైల్ తెరవొద్దని నరసాపురం పట్టణ సీఐ బి.యాదగిరి ప్రజలకు సూచించారు. ఆయన ఫోన్‌కు వాహన అపరాధ రుసుము చలానా పెండింగ్ ఉన్నట్లుగా మెసేజ్ వచ్చింది. ఆ ఫైల్ సందేశాన్ని ప్రజలకు అవగాహన నిమిత్తం సామాజిక మాధ్యమంలో అందుబాటులో ఉంచారు. అటువంటి ఫైల్స్‌ను తెరవొద్దని, తెరిస్తే ఫోన్ హ్యాక్ అయి సైబర్ నేరగాళ్ల చేతికి బ్యాంకు ఖాతాలు చేరే అవకాశం ఉందన్నారు.