'ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి'
MDK: శివంపేట మండలం శభాష్ పల్లి, కొత్తపేట గ్రామాలలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పీఎసీఎస్ ఛైర్మన్ చింతల వెంకటరామిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన రైతులు పండించిన ధాన్యంకు గిట్టుబాటు ధర కల్పించడం కోసమే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.