ఎన్నికల కోడ్.. మద్యం విక్రయాలపై ఆంక్షలు

ఎన్నికల కోడ్.. మద్యం విక్రయాలపై ఆంక్షలు

KMR: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మద్యం దుకాణాలను మూసివేస్తున్నట్లు కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల పోలింగ్, ఓట్ల లెక్కింపు సజావుగా సాగేందుకు మూడు విడతలలో ఆయా మండలాల్లోని కల్లు దుకాణాలు, మద్యం డిపోలు, వైన్ షాపులు, బార్లను మూసివేయాలని ఆదేశించారు.