'తప్పులు లేని ఎలక్టోరల్ జాబితా రూపొందించేందుకు సహకరించాలి'

WNP: త్వరలో జరుగబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ సాధారణ ఎన్నికల నిర్వహణకు తప్పులు లేని ఎలక్టోరల్ జాబితా రూపొందించేందుకు సహకరించాలని అదనపు కలెక్టర్ యాదయ్య రాజకీయ పార్టీల ప్రతినిధులను సూచించారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్షించారు. ఓటరు జాబితాను అన్ని గ్రామ పంచాయతీల్లో అందుబాటులో ఉంచామని తెలిపారు.