లారీ ఢీకొని మహిళ మృతి
MBNR: మరికల్ మండల కేంద్రంలో ప్రదవశత్తూ లారీ ఢీకొని మహిళ మృతి చెందిన ఘటన ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం,, మండల కేంద్రానికి చెందిన అనుష (40) రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా లారీ ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడింది. స్థానికులు గమనించి అంబులెన్స్‌లో మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిందని చెప్పారు.