బహిరంగ వేలం.. భారీగా స్పందన

బహిరంగ వేలం.. భారీగా స్పందన

GNTR: చీరాలలో మద్యం అక్రమ రవాణా కేసుల్లో పట్టుబడిన రెండు వాహనాలకు  బుధవారం బహిరంగ వేలం నిర్వహించారు. జిల్లా ఎక్సైజ్ అధికారి వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో జరిగిన ఈ వేలంలో అశోక్ లేలాండ్ వాన్ 2.80 లక్షల ప్రారంభ ధరతో 3.40 లక్షలకు, స్కూటీ 39 వేల ప్రారంభ ధరతో 41 వేలకు అమ్ముడయ్యాయి. ఈ క్రమంలో వేలానికి భారీగా స్పందన లభించిందని అధికారులు తెలిపారు.