ఎనుమాముల మార్కెట్లో సంఘీభావ ర్యాలీ

WGL: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో చాంబర్ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీ ప్రతినిధులు, సభ్యులు, మార్కెట్ వ్యాపారులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. జమ్మూ కశ్మీర్‌లో పహల్గామ్ ఘటనకు ప్రతీకారంగా భారత్ సైన్యం పాకిస్థాన్ ఉగ్రవాదులను హతం చేయడంతో వారికి సంఘీభావంగా ర్యాలీ చేపట్టారు. ఇది భారత్ సాధించిన విజయమని వారు పేర్కొన్నారు.