VIDEO: గ్యాస్ కొరత.. పండుగ వేళ పడిగాపులు
GDWL: అయిజలోని గ్యాస్ ఏజెన్సీ వద్ద బుధవారం తెల్లవారుజాము నుండే జనం బారులు తీరారు. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధాల నేపథ్యంలో గ్యాస్ సరఫరాకు అంతరాయం ఏర్పడటంతో ఈ ఇక్కట్లు మొదలయ్యాయి. రాబోయే పండుగల దృష్ట్యా గ్యాస్ అవసరం పెరిగినా, ఏజెన్సీల వద్ద సరిపడా స్టాక్ లేకపోవడంతో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.