నేడు నియోజకవర్గం లో ఎమ్మెల్యే పర్యటన వివరాలు

NGKL: అచ్చంపేట నియోజకవర్గంలో శుక్రవారం ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ పర్యటించనున్నారు. ఉదయం 8 గంటలకు బల్మూరు మండల కేంద్రంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 9 గంటలకు పోలేపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభిస్తారు. అనంతరం ఉప్పునుంతల మండలంలోని దాసర్లపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభిస్తారు.